5 నెలలకోసారి మాత్రమే సూర్యుడు ఉదయించే అందమైన ప్రాంతం! ఎక్కడుందో తెలుసా?

Header Banner

5 నెలలకోసారి మాత్రమే సూర్యుడు ఉదయించే అందమైన ప్రాంతం! ఎక్కడుందో తెలుసా?

  Sat Jan 11, 2025 15:54        World

ఈ భూమిపై ఎక్కడైనా సరే సూర్యుడు ఉదయించడం, అస్తమించడం అనే ప్రక్రియ ప్రతిరోజూ జరుగుతుంది. కానీ ఒకచోట మాత్రం అలా కాదు. అక్కడ ప్రతీ 5 నెలలకు ఒకసారి మాత్రమే సూర్యుడు ఉదయిస్తాడు. అది కూడా ఉదయంపూట కాదు, అర్ధరాత్రిపూట ఉదయిస్తాడు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడుంది? 5 నెలలకు ఒకసారి మాత్రమే సూర్యుడు ఉదయించడం వెనుకగల కారణాలేమిటో చూద్దాం. 

 

ఇంకా చదవండివిశాఖ కోర్టు సంచలన తీర్పు! యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్లు జైలు శిక్ష! 

 

అది నార్వేలోని ఆర్కిట్ మహాసముద్రంలో గల స్వాల్బార్డ్ ద్వీపం. చూడ్డానికి అందంగా ఎంతో అందంగా ఉండే ఈ ద్వీపంలో మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇక్కడ ప్రతిరోజూ సూర్యుడు ఉదయించడు. ప్రతీ 5 నెలకు ఒకసారి మాత్రమే ఉదయిస్తాడు. అంటే శాస్త్రవేత్తల ప్రకారం ఈ ద్వీపంలో 5 నెలలపాటు పగలు మరో 5 నెలల పాటు రాత్రి (అక్టోబర్ చివరి నుంచి ఫిబ్రవరి చివరి వరకు) ఉంటుంది. ఎందుకలా జరుగుతుందంటే భూమిపై గల చివరి దేశం లేదా ద్వీపం ఇదే కాబట్టి, పైగా అది తన అక్షం మీద తిరిగే ఉత్తర ధ్రువానికి సమీపంలో ఉంది కాబట్టి ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అక్కడి భౌగోళిక, పర్యావరణ పరిస్థితుల దృష్ట్యా 5 నెలలు పగలు, 5 నెలలపాటు రాత్రి ఉంటుంది. రాత్రి సమయం ఉన్నంతకాలం సూర్యుడు హోరిజోన్ కింద అదృశ్య రూపంగా ఉంటాడు. దీనినే పోలార్ నైట్ అంటారు. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

స్వాల్బార్డ్ ద్వీపంలో 5 నెలలపాటు రాత్రి సమయం ఉండటాన్ని శాస్త్రవేత్తలు, అక్కడికి వెళ్లి వచ్చిన ప్రజలు మనోహరమైన రాత్రుళ్లుగా అభివర్ణిస్తారు. ఎందుకంటే సూర్యుడు ఆకాశం దిగువన దాగి ఉండటం కారణంగా ఇది దట్టమైన చీటకిగా కూడా ఉండదు. మిగతా దేశాల్లో తెల్లవారు జాము సమయం ఎలా ఉంటుందో స్వాల్బార్డ్ ద్వీపంలో రాత్రి వేళ వాతావరణం అలా ఉంటుంది. పైగా ఆకాశం నీలం లేదా ఊదా రంగులో కనిపిస్తూ ఉంటుంది. దీనికి తోడు ద్వీపంలో మెరుస్తున్న మంచు దిబ్బలపై ఆకాశపు రంగు ప్రతిబింబించడంవల్ల ఆ ప్రాంతమంతా ఊదా లేదా నీలిరంగులో ప్రశాంతమైన చల్లని వాతావరణంతో ఆకట్టుకుంటుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు.. 20 లక్షల మందికి ఉపాధి! ప్రజలు 93 శాతం స్ట్రైక్ రేట్ తో..

 

ప్రభుత్వ ఆఫీస్‌ల చుట్టూ తిరగక్కర్లేదుఇకపై ఈజీగా.. వాటిపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఇక వారికి పండగే!

 

రఘురామ కేసులో ప్రభావతికి షాకిచ్చిన హైకోర్టు! వాళ్లు ముగ్గురు కూడా..

 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్... హెల్త్ శాఖ భారీ నోటిఫికేషన్ విడుదల! ఎగ్జామ్ లేకుండా ఎంపిక!

 

తిరుపతి ఘటన ప్రమాదమా... కుట్రా.. మంత్రి కీలక వ్యాఖ్యలు! కారకులు ఏ స్థాయిలో..

 

రఘురామ కృష్ణంరాజు పై టార్చర్ కేసులో సంచలనం! కీలక నిందితుడు అరెస్ట్! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #World #Sunrise #Sun #Travel